BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఎంకే స్టాలిన్ ఓటమి: డీఎంకే పరాజయానికి దారితీసిన 5 ప్రధాన కారణాలు
తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. సొంత నియోజకవర్గం కొలత్తూరులో సీఎం ఎంకే స్టాలిన్ పరాజయం పాలయ్యారు. డీఎంకే కంచుకోట చెన్నైలో విజయ్ ప్రభంజనం సృష్టించారు. డీఎంకేను సంక్షేమ పథకాలు కాపాడలేకపోయాయా? వ్యూహకర్తగా స్టాలిన్ లెక్క తప్పిందా? ద్రవిడ రాజకీయాల్లో పెనుమార్పులకు దారితీసిన 5 ప్రధాన కారణాలు ఏంటి?
విజయ్ కారు డ్రైవర్ కొడుకు: ఎవరీ శబరినాథన్, ఎంత మెజార్టీతో గెలిచారు?
విజయ్ డ్రైవర్ కొడుకు శబరినాథన్ టీవీకే పార్టీ తరఫున విరుగంబాక్కమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి ఎ.ఎం.వి. ప్రభాకర రాజాపై గెలుపొందారు. ఇంతకీ, శబరినాథన్ ఏం చదువుకున్నారు? ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
శుభేందు అధికారి: ఆరేళ్లలో బెంగాల్లో బీజేపీని అగ్రస్థానానికి చేర్చిన నాయకుడు
మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఒకప్పుడు నంబర్ టూగా ఉండి, ఇప్పుడు టీఎంసీ కంచుకోటను బద్దలు కొట్టారు శుభేందు అధికారి. 2007 నందిగ్రామ్ ఉద్యమ రూపశిల్పిగా గుర్తింపు పొందిన ఆయన, క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికే దిశగా సాగిన శుభేందు అధికారి రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందంటే..
అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సినీ హీరో టు చీఫ్ మినిస్టర్.. ఎవరెవరు?
రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి అగ్రహీరోలు తమిళ సినిమాను ఏలుతున్న 1990ల ప్రారంభంలో హీరోగా ప్రస్థానం ప్రారంభించిన విజయ్, తనదైన నటనతో పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. తన సమకాలీనుడైన మరో హీరో అజిత్, సీనియర్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ వంటివారూ తమిళనాట క్రేజ్ కొనసాగిస్తుండగా, విజయ్ కూడా సమాంతరంగా తన అభిమాన గణాన్ని పెంచుకున్నారు. మాస్ హీరోగా పేరు సంపాదించుకున్నారు.
విజయ్: సినిమాలే కాదు రాజకీయాల్లోనూ 'హీరో'గా ఎదిగారా?
అభిమానులు ప్రేమగా 'దళపతి 'గా పిలుచుకునే విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ డీఎంకేను వెనక్కి నెట్టింది.
విజయ్: తమిళనాట 62 స్థానాలలో గెలిచి 45 సీట్లలో ఆధిక్యంలో ఉన్న టీవీకే.. కేరళలో యూడీఎఫ్ విజయం - బెంగాల్, అస్సాంలో బీజేపీ ముందంజ
మొత్తంగా 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఏ పార్టీ అయినా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు సాధించాలి. రాత్రి 7.30 గంటల సమయానికి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వెల్లడైన ఫలితాలు, సరళి ప్రకారం.. విజయ్ టీవీకే పార్టీ 62 సీట్లను గెలుచుకుని మరో 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే 24 సీట్లు గెలిచి మరో 34 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 22 స్థానాలు గెలిచి మరో 26 చోట్ల ఆధిక్యంలో ఉంది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


































































